సిరిసిల్లలో చోరీ : 5 తులాల బంగారం అపహరణ

సిరిసిల్ల పట్టణం : పట్టణంలోని వెంకంపేట శివారులో కాసర్ల శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఇంట్లో సోమవారం అర్థరాత్రి దొంగలు పడ్డారు. ఇంట్లోని బంగారం, వెండితోపాటు నగదును అపహరించారు. శ్రీనివాస్‌ సోమవారం తన ఇంటికి తాళం పగులగొట్టి ఉంది. దొంగలు బీరువాలోని 5 తులాల బంగారు నగలు, 10తులాల వెండి, 20వేల నగదు ఎత్తుకెళ్లారు. స్థానిక సీఐ నాగేంద్రాచారి సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.