సిరిసిల్లలో నాలుగు తుపాకులు స్వాధీనం
సిరిసిల్ల టౌన్: సిరిసిల్లలోని వెంకంపేట గ్రామంలో గురువారం పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు రాజయ్య, దేవయ్యల ఇంట్లో నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ నర్సయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో రాజయ్య , దేవయ్య లను అరెస్టు చేశారు.