సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య, రాస్తారోకో
కరీంనగర్, జనంసాక్షి: కరీంనగర్ జిల్లా సరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మరమగ్గాలకు సర్‌చార్జీలు తొలగించాలంటూ ప్రభాకర్ అనే కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దాంతో ప్రభాకర్ మృతదేహంతో నేతన్నలు సిరిసల్ల చేనేత విగ్రహం ఎదుట రాస్తారోకో నిర్వహించారు.