సిరిసిల్లలో నేత కార్మికుని ఆత్మహత్య
సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని దుబాస్నగర్లో సబ్బని శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఉరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరమగ్గాలకు పని లేకపోవడంతో అప్పులు పెరిగిపోయి అనారోగ్యానికి గురయ్యాడు. ఖరీదైన వైద్యం చేయించుకోనే ఆర్థిక స్థోమత లేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల సీఐ సర్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.