సిరిసిల్ల కలెక్టర్ తీరుపై పొన్నం ఆగ్రహం
టిఆర్‌ఎస్ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఆరోపణ
రాజన్నసిరిసిల్ల,నవంబర్13(జనంసాక్షి): సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌పై ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల కలెక్టర్ టీఆర్‌ఎస్ లీడర్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నువ్వు ఐఏఎస్‌వా..గులాబీ కండువా కప్పుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తవా? అని పొన్నం ప్రశ్నించారు. యువరాజు మెప్పు కోసం కలెక్టర్ బాధ్యతలు మరిచారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు కలెక్టర్‌కు పని మనిషుల్లా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. మరుగుదొడ్ల నిధులు కాజేసిన టీఆర్‌ఎస్ నేతలకు కలెక్టర్ వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తే కలెక్టర్‌కు ఎందుకంత కోపమని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.