సిరిసిల్ల సిరి పట్టు చీరలు ఆవిష్కరించిన గవర్నర్.
చేనేత కళాకారుడు వెల్డి హరిప్రసాద్ కు ప్రశంసలు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 16. (జనంసాక్షి). సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ దంపతులు చేతిమగ్గంపై నేసిన సిరిసిల్ల సిరి పట్టుచీరను చూసి గవర్నర్ తమిళ సై చూసి అబ్బురపడ్డారు. చేనేత దినోత్సవం సందర్భంగా వెల్ది హరిప్రసాద్ దంపతులు సిరిసిల్లలో వెండి పట్టు జరి చీరను ఆవిష్కరించిన విషయం ఆవిష్కరించిన విషయం తెలిసిండే. సిరిసిల్ల సిరి పట్టుచీర గురించి తెలుసుకున్న గవర్నర్ తమిళసై మంగళవారం తేనేటి విందుకు చేనేత కళాకారుడు హరి ప్రసాద్ ను ఆహ్వానించి చీర ప్రత్యేకతను తెలుసుకొని అభినందించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ చీర డిజైన్ రూపొందించడం కోసం 18 రోజులు కష్టపడి 23 రోజుల శ్రమించి చేతిమగ్గంపై తన భార్య రేఖతో కలిసి చీరను నేసినట్లు గవర్నర్ తమిళసైకి వివరించారు. సిరిసిల్లకు ప్రత్యేకంగా బ్రాండ్ తీసుకురావడం కోసం సిరిసిల్ల సిరిపట్టు చీరను రూపొందించినట్లు తెలిపారు. తమ కళ ను గుర్తించి అభినందించిన గవర్నర్ కు హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు