సివిల్ ఎస్సైగా ఎంపికైన వన్నెల్ బి గ్రామ నివాసి మిట్టపల్లి సుప్రియరెడ్డి
బాల్కొండ ఆగష్టు 07 (జనం సాక్షి )
కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని ఓ రైతు బిడ్డ నిరూపించిన మహిళ. రైతు కుటుంబంలో జన్మించి అకుంఠిత దీక్షతో తర్ఫీదు పొంది లక్ష్యాన్ని సాధించింది నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలం, వన్నెల్ బి గ్రామ నివాసి ఆదివారం విడుదలైన ఎస్సై పోస్టులో
ఎంపిక అయ్యారు. చిన్నపాటి వ్యవసాయం చేసుకుని జీవించే మిట్టపల్లి సంతోష్ రెడ్డి దంపతుల కుమార్తె అయిన మిట్టపల్లి సుప్రియ రెడ్డి ఎస్సెగా ఎంపిక అయ్యారు ప్రాథమిక విద్యాలయంలో విద్య పూర్తి చేయగా ఉన్నత పాఠశాల విద్య హైదరాబాద్ లో పూర్తి చేసింది తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, సహకారంతో ఎలాగైనా ఎస్సై కావాలి తలంచి హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటూ చదువు కొనసాగించి ఎస్సె పరీక్ష రాయగ ఎం సుప్రియ రెడ్డి 235 మార్కులు సాధించి ఈ పోస్టుకి ఎంపిక అయినది. కష్టంతో కాదు ఇష్టంతో చదివితే ఏ ఉద్యోగమైన సాధించవచ్చని, తన తల్లిదండ్రుల ప్రోత్సహించారని తెలిపారు. రైతు కుటుంబంలో జన్మించిన సుప్రియ ఎస్సై పోస్టుకి ఎంపిక కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వన్నెల్ బి గ్రామంలో మీట్టపల్లి సుప్రియ కష్టపడి ఉన్నత చదువులు చదువుకుని ఎస్సై ఉద్యోగం సాధించడం పట్ల
మా గ్రామం నుంచి మొదటి మహిళ ఎస్సైగా ఎన్నికైన సందర్భంగా గ్రామ సర్పంచు, ఉప సర్పంచ్ , గ్రామస్తులు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని ఆనందం వ్యక్తం చేశారు.