సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా మహాసభను జయప్రదం చేయండి

 ఏఐటీయూసీ  జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
 నకిరేకల్ లో జరిగే సివిల్ సప్లై హమాలి యూనియన్ నల్లగొండ జిల్లా ఏడవ మహాసభ జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండలో సివిల్ సప్లైస్  హమాలి యూనియన్ జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి  మాట్లాడుతూ జూలై 21వ తేదీ గురువారం నకరేకల్ పట్టణంలో సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా ఏడవ మహాసభలు జరుగుతున్నాయని అన్నారు. డిసెంబర్ తో రేట్ల ఒప్పంద ముగిసిందని ఆయిన సివిల్ సప్లై అధికారులు కొత్త రేట్లు పెంచకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే కూలీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హమాలి రేట్లు తక్షణమే పెంచాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వము ఎఫ్ సీ ఐ  నీ ఎత్తివేసే కుట్ర చేస్తుందనీ ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడం వలన కార్మిక వర్గం,సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.
  కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికుల పొట్ట కొట్టే విధంగా ఉన్నాయని అన్నారు. కార్మిక చట్టాలను మార్చి తీవ్ర అన్యాయం చేశారు అని అన్నారు. కార్మిక హక్కుల ప్రయోజనాలు కాపాడడం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని గత 35 సంవత్సరాలుగా సివిల్ సప్లై కార్మికుల సమస్యలపై ఏఐటియుసి రాజిలేని పోరాటాలు చేస్తుందని అన్నారు.జూలై 21 తేదీన నకిరేకల్ లో జరిగే సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా మహాసభ లో హామాలి కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ మహాసభకు సివిల్ సప్లై హమాలి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు గారు ఏఐటియుసి జాతీయ కార్యవర్గ సభ్యులు ఉజ్జీణీ రత్నాకర్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా నాయకులు దోనకొండ వెంకటేశ్వర్లు,బుచ్చయ్య, నాగరాజు, ధర్మయ్య, టి గిరి,జానయ్యా, నగేశ్, సైదులు,రాముడు,కృష్ణ, ఎల్లయ్య,శ్రిను,జాని, లింగస్వామి,సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area
 

తాజావార్తలు