సిసి రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి కార్పొరేటర్
డివిజన్ అభివృద్ధి మా ద్వేయంగా ముందుకు సాగుతున్నామని కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ మానస సరోవర్ విలాస్ పద్మావతి కాలనీ లో 25 లక్షలతో సిసి రోడ్డు పనులను అధికారులతో కలిసి కార్పోరేటర్ పరిశీలించారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని జరుగుతున్న పనులకు నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు కాంట్రాక్టర్ కు ఆదేశించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతామని డివిజన్ పరిధిలో మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు డి ఈ కార్తీక్, ఏఈ అరుణ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు భాస్కర్, అనంతుల సంతోష్, ప్రభాకర్, శ్యాంసుందర్, రమ, శివ, రామకృష్ణ, జమందర్, పెంటన్న, అనిల్, శ్రీనివాస్, స్వప్న, ఉదయ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.