సీఎంఆర్ఎఫ్ పేద‌ల ఆరోగ్యానికి అండ‌.

మాజీ మంత్రి ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ
పట్నం మ‌హేంద‌ర్ రెడ్డి.
తాండూరు అక్టోబర్ 7( జనం సాక్షి)పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ స‌ర్కారు భ‌రోసా అందిస్తుంద‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైరాబాద్ లోని ఎమ్మెల్సీ నివాసంలో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామానికి చెందిన బి. శ్రీనివాస్ కు 40,వేల రూపాయల చెక్కును అందింజేశారు.ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌ తో తెలంగాణ స‌ర్కారు భ‌రోసా అందిస్తుంద‌ని అన్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ వైద్యం చేయించుకోలేని నిరుపేద‌లు సీఎంఆర్ఎఫ్ ప‌థకాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాణిక్ రెడ్డి, నర్సి రెడ్డి, హారి సుధన్ రెడ్డి, బొయిని వెంకటప్ప, యాదవ రెడ్డి, గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.