సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేసిన జెడ్పి చైర్మన్
జనం సాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన గుండేటి రమేష్ కు ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా మంజూరైన రెండు లక్షల విలువైన చెక్కును బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అందజేశారు. రమేష్ అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందగా వైద్య ఖర్చుల నిమిత్తం సాయం చేయాలని జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ని కోరగా వెంటనే స్పందించిన ఆయన ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా రూ .2 లక్షల మంజూరీ చేయించి ఆ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చిందం తిరుపతి, రాచకొండ రవి తదితరులు పాల్గొన్నారు.