సీఎంకు టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు లేఖ
హైదరాబాద్, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి టీఆర్‌ఎస్ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు లేఖ రాసారు. ఎండ తీవ్రతను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలన్నారు. సింగరేణి కార్మికులకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరీక్షలను వాయిదా వేయటంతో పాటు విద్యుత్ కోతలను ఎత్తివేయాలని లేఖలో కోరారు. వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలను ఎక్స్‌గ్రేషియో వెంటనే చెల్లించాలన్నారు.