సీఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు: కేటీఆర్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ డెడ్‌లైన్లకు లొంగదని ముఖ్యమంత్రి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణవాదుల అత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సీఎం మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. డెడ్‌లైన్లు పెట్టి మాట తప్పింది. కాంగ్రెస్‌ పార్టీ అని, తెలంగాణ నేతలు కాదని ఆయన అన్నారు.