సీఎం కిరణ్ కుమార్ రాకతో వలసలు పెరిగాయి: శంకర్రావు
హైదరాబాద్,(జనంసాక్షి): సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు పెరిగాయని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శంకర్రావు కిరణ్‌కుమార్ రెడ్డిపై మండిపడ్డారు. కిరణ్ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే సుమారు నలబై మంది నేతలు కాంగ్రెస్ పార్టీని వీడారని వెల్లడిరచారు. కిరణ్ సీఎం కాగానే పదిహహేడు మంది ఎమ్మెల్యేలు , ఇద్దరు ఎంపీలు పార్టీని వదిలి వెళ్లారని, పదహారు మంది పార్టీకి గుడ్‌బై చెప్పారని తెలిపారు. నిన్న ఇద్దరు ఎంపీలు వివేక్, మందాలు పార్టీ నుంచి వెళ్లిపోయారని స్పష్టం చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని అడిగే వాళ్లే లేకుండా చేశాడని ఆరోపించారు.
కిరణ్ హయాంలో విడుదలైన ఎర్రచందనం జీవోపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని శంకర్రావు డిమాండ్ చేశారు. ఈ జీవో విషయంలో తాను సుప్రీంకోర్టు మెట్లెక్కనున్నట్లు తెలిపారు. గత జూలై 10న హైకోర్టులో కేసు వేశానని, మళ్లీ త్వరలోనే సుప్రీంలో కూడా పిటిషన్ దాఖలు చేస్తానని పేర్కొన్నారు. మత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని తొలగించడం దారుణమని శంకర్రావు మండిపడ్డారు.