సీఎం కేసీఆర్ చైనా పర్యటన ఖరారు
హైదరాబాద్ ఆగస్ట్ 22(జనంసాక్షి):
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వచ్చే నెలలో చైనా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. చైనాలో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. పర్యటన సందర్భంగా సీఎంతో పాటు మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.