సీఎం దిష్టిబొమ్మ దహనం

కోహెడ: విద్యుత్‌ కొతలు, సర్‌ఛార్జీలకు నిరసనగా కోహెడలో సీపీఐ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను సోమవారం దహనం చేశారు. ఈ  సందర్భంగా మండల కమిటీ కార్యదర్శి వి. బాలమల్లు మాట్లాడుతూ
ప్రభుత్వం ఏడు గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పి. అధికారంలోకి వచ్చాక కనీసం ఐదు గంటలు కూడా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సర్‌ ఛార్జీల పేరుతో పేదలపై మోయలేని భారం మోపిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.