సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
-కలెక్టర్ స్మితా సబర్వాల్
భీమదేవరపల్లి , ఏప్రిల్ 17 (జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 25న జిల్లాకు వస్తున్నందున, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం భీమదేవరపల్లి మండలం ములుకనూరులోని వంగరలోని సీఎం ప్రారంభించనున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, పోలీసు స్టేషన్ భవనాలు, ముల్కనూర్‌లోని 132/33కేవీ సబ్‌స్టేషన్, బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. సభాస్థలి వద్ద ఫోటో ఎగ్జిబిషన్, తదితర ఏర్పాట్లు ఘనంగా చేయాలని అధికారులకు సూచించారు. ఆమెతో పాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్ వి.రవీందర్ , సాంఘిక సంక్షేమాశాఖ జేడీ నాగేశ్వర్‌రావు, డీఆర్‌డీఏ పీడీ శంకరయ్య, రోడ్లు భవనాలశాఖ ఎస్ ఈ చందులాల్, వ్వవసాయశాఖ జేడీ ప్రసాద్, ట్రాన్సుకో ఎస్‌సీ నారాయణ, అర్డీఓ సంధ్యారాణి, డీపీఆర్‌ఓ పి.శ్రీనివాస్, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజినీర్ నర్సింగరావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటరమణ, తహసీల్దార్ అబ్దుల్ కరీం, ఎంపీడీఓ దేవేందర్‌రాజు, డీఎస్పీ సీఎస్‌ఎన్‌రెడ్డి , సీఐ తిరుమల్, ఎస్‌ఐ ఎర్రల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.