సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల నిరసన..
వీణవంక,ఫిబ్రవరి 03,(జనంసాక్షి) : భారత రాజ్యాంగాన్ని అవనమాపరిచేలా మాట్లాడిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్ర బీజేపీ శాఖ ఇచ్చిన పిలుపు మేరకు మండలంలోని గంగారం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాం వద్ద బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మౌన దీక్షకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి, దళిత మోర్చా అధ్యక్షుడు యాదగిరి ప్రజాప్రతినిధులు, నాయకులు శ్రీనివాస్‌యాదవ్, గౌతమ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, విజయ్‌రెడ్డి, కనకం మధునయ్య, తిరుపతిరెడ్డి, ప్రశాంత్ పటేల్, లింగారెడ్డి, నాగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, సందీప్, కుమారస్వామి, రాజు తదితరులు ఉన్నారు.