సీఎం సహాయనిది పేదలకు వరం: టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నర్ర రాజేందర్.

దౌల్తాబాద్ అక్టోబర్ 11, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలో దొమ్మాట గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బాలుగారి బాబు కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఆ కుటుంబానికి టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు నర్ర రాజేందర్ ఒక లక్ష రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని వారి జీవితాలకు భరోసా ఇస్తున్నాయని తెలిపారు.ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్సంలా ఆదుకుంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ ఎండి హైమద్, సల్ల స్వామి, బాబు, రాములు, యాదగిరి, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.