సీఎల్పీ ముందు బైఠాయించిన డీఎల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రి వర్గం నుంచి భర్తరఫ్‌కు గురైన కాంగ్రెస్‌ నేత డీఎల్‌ రవీంద్రారెడ్డి కాంగ్రెస్‌ శాసన సభాపక్ష కార్యాలయం ముందు బైఠాయించారు. ఇవాళ ఆయన శాసన సభా ప్రాంగణంలో సీఎల్పీ కార్యాలయానికి చేరుకుని కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టడానికి ప్రయత్నించాడు. ఆయనను ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరయణారెడ్డి నిలువరించారు. కార్యలయంలో విలేకరుల సమావేశం  పెట్టడానికి డీఎల్‌కు అనుమతి లేదని గండ్ర చెప్పడంతో డీఎల్‌ కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. నిరసన కొనసాగుతుంది.