సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ

వాంకిడి:దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్వాలీ నిర్వహించారు. స్థానిక హనుమాన్‌ మందిరం నుంచి ప్రారంభమైన బన్‌స్టాండ్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా సీఐటీయూ ఆసిఫాబాద్‌ డివిజన్‌ అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ కార్మిక సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని.

కార్మికులకు కనీస వేతనాలు కల్పించడంలో విఫలమైందన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడి కార్యకర్తలు, ఆయాలు,

మధ్యాహ్న భోజన నిర్వాహకులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.