సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ తుప్ప ఆనంద్
వికారాబాద్ రూరల్ జూలై 31 జనం సాక్షి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ తుప్ప ఆనంద్ సూచించారు సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో గ్రామాల్లో పైపు లీకేజీల కారణంగా వర్షపు నీరు త్రాగునీటిలో కలి సే అవకాశం ఉన్నందున వేడి చేసి చల్లార్చిన నీటిని త్రాగాలని ఆయన సూచించారు ముఖ్యంగా ఇండ్లలో వేడి వేడి పదార్థాలు తినాలని నిల్వ ఉన్న తిరుపడ్డరాలు తినకూడదని ఆయన హెచ్చరించారు చిన్నారులకు మోతాదులో లైట్ ఫుడ్ మాత్రమే పంపిణీ చేయాలన్నారు గ్రామాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని అత్యసార డయోరియా వంటి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక వైద్య సిబ్బందిపై పంచాయతీ అధికారులపై ఉందన్నారు మురికి కాలువలు ఇప్పటికప్పుడు శుభ్రం చేసి దోమలను నివారించాలని ఆయన సూచించారు గ్రామాల్లో అంగన్వాడి కేంద్రాల్లో ఆశా వర్కర్ల వద్ద సబ్ సెంటర్ లో ప్రథమ చికిత్స కు సంబంధించి ఏర్పాట్లు చేసి అవసరమున్న మంజులను ఎప్పటికప్పుడే సరఫరా చేయాలన్నారు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు గ్లూకోస్ సరఫరాల పెంచాలని ఆయన ఆదేశించారు ముఖ్యంగా చిన్నారులకు అతిసారా డయోరియా వంటి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులను సూచించారు పై జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ వ్యాధుల నుండి రక్షించబడుతామని ఆయన అన్నారు