సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి,

*సబ్ యూనిట్ ఆఫీసర్ బాదావత్ నందా,
ఖానాపురం అక్టోబర్8(జనం సాక్షి )
ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సబ్ యూనిట్ ఆఫీసర్ బాదావత్ నందా అన్నారు. మండలంలోని  కొత్తూరు సబ్ సెంటర్ పరిధిలోని రాగంపేటలోమలేరియా పాజిటివ్ కేసు నమోదు కావడంతో
సబ్ యూనిట్ ఆఫీసర్ బాదావత్ నందా పర్యవేక్షణలో
దోమల నివారణ మందు ఏ సీఎం 5% మందు
మరియు తిమో ఫాస్ మందు స్ప్రే చేయించారు .
ఈ సందర్భంగా సబ్ యూనిట్ ఆఫీసర్ నందా మాట్లాడుతూ ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా,. చికెన్ గున్యా, మెదడువాపు లాంటి వ్యాధులు వస్తాయనిపరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనిపరిసరాలలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని సూచించారు.ప్రతివారం తప్పనిసరిగా డ్రైడే పాటించాలనిదోమల పుట్టకుండా,కుట్టకుండా చూసుకోవాలనికోరారు.ఈ కార్యక్రమంలో
 రాగం పేట  సర్పంచ్ భాష బోయిన ఐలయ్య,హెల్త్ అసిస్టెంట్ గొడిశాల భాస్కర్, ఏఎన్ఎంలు రజిత, జ్యోతి,
ఆశాలుసంధ్య, సుమలత
మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.