సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– మండల వైద్యాధికారి మురళీకృష్ణ
కుల్కచర్ల, జులై 21(జనం సాక్షి): వాతావరణంలో మార్పుల దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మురళీకృష్ణ అన్నారు. గురువారం కుల్కచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మాట్లాడుతూ..
తేలికపాటి వర్షాలకు నీరు నిలవ ఉండి,వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, కావున ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు.దోమలు కుట్టకుండా మరియు పుట్టకుండా చూసుకోవాలని అని అన్నారు.వాతావరణంలో వస్తున్న భారీ మార్పులను దృష్టిలో ఉంచుకొని పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
Attachments area