సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చర్యలు చేపట్టాలి

పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్ష, సహాయ కార్యదర్శి రమేష్, భానుచందర్ డిమాండ్

టేకులపల్లి, ఆగస్టు 24( జనం సాక్షి ): ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతు ఉన్నారని సులానగర్ పిహెచ్ సి,పల్లే దవాఖానా లలో తగిన మందులు,సిబ్బందిని ఏర్పాటు చేయాలని మొబైల్ హెల్త్ వ్యాన్ ఏర్పాటు చేసి గ్రామాల్లో వైద్యం చేయాలని పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ల రమేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ డిమాండ్ చేశారు.సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం టేకులపల్లి మండలంలో సులానగర్ పి హెచ్ సిలలో ఇంచార్జి వైద్యఅధికారి కి ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని సీజనల్ వ్యాధులకు సంబంధించి జూలై,ఆగస్టు నెలలో భారీ వర్షాల కారణంగా,, మలేరియా,డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,దోమల నివారణకు బ్లీచింగ్, శానిటేషన్ తదితర చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, దోమతెరలను గ్రామస్థాయి యందు పంపిణీ చేయాలని,ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రగతిశీల యువజన సంఘం డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ మండల అధ్యక్ష,కార్యదర్శులు భూక్య లక్ష్మణ్, తోటకూరి సతీష్, లచ్చు, కిషన్, రామ, గవాస్కర్ తదితరులు పాల్గొన్నారు.