సీతారామంలో ఆకట్టుకుంటున్న కానున్న కళ్యాణం పాట

తెలుగు తమిళం మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ’సీతారామం’ చిత్రాన్ని ఆగస్ట్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్‌ కంటెంట్‌ మంచి రెస్పాన్స్‌ తెచ్చుకోగా.. లేటెస్టుగా థర్డ్‌ సింగిల్‌ ను లాంచ్‌ చేశారు. ’కానున్న కళ్యాణం’ అనే ఈ పాటని హైదరాబాద్‌ మల్లారెడ్డి ఉమెన్స్‌ కాలేజీలో జరిగిన ఈవెంట్‌ లో గ్రాండ్‌ గా విడుదల చేశారు. దుల్కర్‌ సల్మాన్‌ ` మృణాల్‌ ఠాకూర్‌ మరియు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ పాటకు వేదికపై దుల్కర్‌ ` మృణాల్‌ జంట డ్యాన్స్‌ చేసి ప్రేక్షకులని అలరించారు. ’కానున్న కల్యాణం ఏమన్నది?.. స్వయవరం మనోహరం.. రానున్న వైభోగం ఎటువంటిది?.. ప్రతీ క్షణం మనోహరం..’ అంటూ సాగిన ఈ క్లాస్‌ నంబర్‌ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరపరిచిన ఈ పాట హృదయానికి హత్తుకుంటోంది. అనురాగ్‌ కులకర్ణి మరియు సిందూరి ఈ పాటని అద్భుతంగా ఆలపించారు. దివంగత
గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటకు అర్థవంతమైన సాహిత్యం అందించారు. మంచి లోకేషన్స్‌ లో చిత్రీకరించిన ఈ పాట చాలా ఆహ్లాదకరంగా వుంది. దుల్కర్‌ ` మృణాల్‌ మధ్య కెమిస్టీ బాగా కుదిరింది. పీఎస్‌ వినోద్‌ సినిమాటోగ్రఫీ ప్రశంసనీయం. ’కానున్న కళ్యాణం’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ.. ఇలాంటి అందమైన పాట చేయడం నా కెరీర్‌ లో ఇదే మొదటిసారి. కాశ్మీర్‌ మంచు ` ట్రెడిషనల్‌ దుస్తులలో చాలా అందంగా చిత్రీకరించాం. మోస్ట్‌ రొమాంటిక్‌ విజువల్‌ వండర్‌ లాంటి సాంగ్‌ ఇది. ఇది నా ఫేవరేట్‌ సాంగ్‌. ఈ పాటని విూ సమక్షంలో విడుదల చేయడం ఆనందంగా వుంది. ఇంతమంది విద్యార్ధులని ఒక్క చోట చూడటం ఇదే మొదటిసారి. ఆగస్ట్‌ 5న అందరం థియేటర్‌ లో కలుద్దాం అని అన్నారు మృణాల్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ’సీతా రామం’ బ్యూటీఫుల్‌ లవ్‌ స్టొరీ. ’కానున్న కళ్యాణం’ నాకు ఎంతో ఇష్టమైన పాట. ఈ పాటని చాలా గ్రాండ్‌ గా షూట్‌ చేశాం. సినిమా అద్భుతంగా వుంటుంది. ఆగస్ట్‌ 5న అందరూ థియేటర్‌ లో సినిమా చూడాలి అని కోరారు. తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. ’ఈ సినిమాలో చాలా ఆసక్తికరమైన పాత్ర చేస్తున్నా. దర్శకుడు హను కాల్‌ చేసి.. సీతారామా మధ్యలో నీవు హనుమంతుడివని చెప్పారు. ఆయన ఒకసారి కథ చెప్పిన తర్వాత మరో ఆలోచన లేకుండా ఈ సినిమా చేస్తున్నాని చెప్పా. హను అద్భుతమైన దర్శకుడు. సీతారామం అందమైన ప్రేమకథ. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రేమ కథ చూడలేదు‘ అని అన్నారు.