సీనియర్ జర్నలిస్ట్ కొల్పుల శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మృతి

దౌల్తాబాద్ అక్టోబర్ 13, జనం సాక్షి.
 దౌల్తాబాద్ మండలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కొల్పుల శ్రీనివాస్ గారు బైక్ ప్రమాదంలో తీవ్ర గాయపడి.. గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారన్న వార్త ఎంతో వేదనకు గురిచేసిందని ..ఎల్లప్పుడూ నవ్వుతూ, నవ్వించే ఆత్మీయుడు శ్రీనివాస్ తో ఉన్న అనుబంధం మరిచిపోలేనిదన్నారు….ఆయన మరణం మాకు ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని..సీనియర్ జర్నలిస్టుగా ,వివాద రహితుడుగా ఆయన అందరి తలలో నాలుకగా మెలిగి పేరుతెచ్చుకున్నాడన్నారు… ఆయన మరణంతో వారి కుటుంబంతో పాటు తీరని లోటన్నారు…..ఆయన అకాల మరణంను జీర్ణించుకోలేక పోతున్నామని..మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.