సీనియర్ నటి బిందు మాధవి కన్నుమూత…

ఒంగోలు: సీనియర్‌ నటి బిందుమాధవి ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఆమె మృతికి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ సంతాపం తెలిపింది. గతంలో ఆమె వైద్యానికి కాదంబరి కిరణ్‌ సాయం అందజేశారు. పలు సినిమాల్లో క్యారెక్టరు ఆర్టిస్టుగా బిందుమాధవి నటించారు.