సీనియర్ సభ్యులు ముత్యం యాకయ్యని సన్మానించిన జై కిసాన్ రైతు మిత్ర సంఘం నాయకులు
జనం సాక్షి, చెన్నరావు పేట
మండలంలోని అక్కలచెడ గ్రామ జై కిసాన్ రైతు మిత్ర సంఘానికి చెందిన సీనియర్ సభ్యులు ముత్యం యాకయ్యని సంఘం సభ్యులు శుక్రవారం సన్మానించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు కోరే రమేశ్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుండి సంఘం దిగ్విజయంగా కొనసాగుతుందని,రైతుమిత్ర సంఘం పొదుపు సంఘం ద్వార రైతులను ఆర్థికంగా ఆదుకోవడం జరిగిందని అన్నారు.వాతావరణంలో జరిగే మార్పులు పంటలు పండించే విధానాల గురించి సమావేశంలో చర్చించుకున్నామని అన్నారు.57సంవత్సరాలు నిండినందున యాకయ్య పొదుపు సంఘం నుండి విరమణ పొందాడని కావున ఈ చిన్న సత్కారం సంఘం తరుపున చేశామని అన్నారు.ఈ కార్యక్రమంలో జై కిసాన్ రైతు మిత్ర సంఘం కార్యదర్శి ఒంటరి క్రాంతి,కోశాధికారి ఇస్లావతు రాంచంద్రు,కార్యవర్గ సభ్యులు ముత్యం భద్రయ్య,ముత్యం రాజు,బాధావతు కృష్ణ,ముత్యం రాములు,పెద్దమ్మల సతీశ్,పడిదం మహేందర్,కేషబోయిన వెంకన్న లు పాల్గొన్నారు.