సీపీఎం కార్యాలయంలో మేడే వేడుకలు..
హైదరాబాద్ : సీపీఎం కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పాల్గొన్నారు. భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం..కార్మిక చట్టాల మార్పు వంటివి కార్మిక వర్గంపై తీవ్ర ప్రభావం చూపుతాయని రాఘవులు పేర్కొన్నారు. కార్మిక హక్కులు కాపాడాల్సినవసరం ఉందని రాఘవులు పేర్కొన్నారు. సరళీకరణ, నయా ఉదార వాద ఆర్థిక విధానాల వల్ల కార్మిక వర్గం మరిన్ని సమస్యల్లోకి నెట్టబడుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. గతంలో సాధించుకున్న హక్కులను కోల్పోవడంతో పాటు కార్మిక వర్గంపై మరింత క్రూరత్వం పెరిగిందన్నారు. ప్రత్యేక తెలంగాణలో సమస్యలు పరిష్కారమౌతాయన్న కార్మిక వర్గానికి పది నెలల కాలంలో నిరాశే మిగిలిందన్నారు. కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు, పర్మినెంట్ ఉద్యోగాలన్న పాలకుల మాటలు నీటి మూటలుగా మిగిలాయని విమర్శించారు.