సీపీఎస్ పింఛను విధానం రద్దు చేయాలి
నిజామాబాద్,సెప్టెంబర్30 (జనంసాక్షి): సీపీఎస్ పింఛను విధానంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఉపాధ్యా సంఘాల నేతలు పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాలిట గుదిబండగా మారిన సీపీఎస్ పింఛను విధానాన్ని రద్దు చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. పాత పింఛను విధానాన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన ఒత్తిడి తీసుకొచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈవిషయమై సానుకూలంగా స్పందించిన ఆయన తగురీతిలో న్యాయం జరిగేలా చూడాలన్నారు.