సీపీగెట్ ఫలితాల్లో శ్రీ సాయి త్రివేణి విద్యార్థుల ప్రతిభ

 

సూర్యాపేట (జనంసాక్షి): మంగళవారం వెలువడిన సీపీగెట్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని జిల్లా కేంద్రంలోని శ్రీసాయి త్రివేణి డిగ్రీ అండ్ పీజీ కళాశాల కరస్పాండెంట్ పెసర జనార్దన్ రెడ్డి అన్నారు.బుధవారం ఆ కళాశాలలో ప్రిన్సిపల్ తన్నీరు ఉపేందర్ అధ్యక్షతన జరిగిన
అభినందన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.తమ కళాశాల విద్యార్థులు సీపీగెట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు.ప్రస్తుతం కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని అన్నారు.విద్యార్థి దశ అమూల్యమైందని, ఈ దశలోనే భవిష్యత్ ప్రణాళికతో ముందుకు సాగాలని అన్నారు.ఫిజిక్స్ విభాగంలో ఏ.ధరణి 8 , కె.వర్షిణీ 13 , బి.యమున 14 , రూప 38 , ఎల్లేష్ 42 , స్పందన 46 , ఎస్ కే రఫీ 53 , జీ. గంగ 72వ ర్యాంక్ సాధించారని చెప్పారు. కెమిస్ట్రీ విభాగంలో ఆర్.అక్షయ 17 , ఎం.నగేష్ 260, బయోటెక్నాలజీ విభాగంలో పి.స్వాతి 431వ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు.అనంతరం వారిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డి.అనిల్ కుమార్ , అధ్యాపకులు నాగలింగం , రమేష్ , సతీష్ , హరీష్ , రవళి , సంతోషి , శ్రీనివాస్ రెడ్డి , వెంకట్ రెడ్డి, పూర్ణచందర్ , శ్రీనివాస్ , సోమరాజు , మల్సూర్ , కృష్ణమూర్తి , వీరన్న , బద్రు తదితరులు పాల్గొన్నారు.