సీబీఐ ఎదుట హాజరైన రాజగోపాల్
హైదరాబాద్, జనంసాక్షి: జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు రాజగోపాల్ సీబీఐ ఎదుట హాజరయ్యారు. దిల్‌కుషా అతిథి గృహంలో ఇవాళ ఆయన సీబీఐ అధికారుల ముందు హాజరై వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ కేసులో అరెస్టైన రాజగోపాల్ ఇటీవలే బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.