‘సీబీఐ న్యాయవాదుల తీరు సరిగాలేదు ‘
హైదరాబాద్, జనంసాక్షి: కేంద్ర ఆదేశాల మేరకే సీబీఐ వ్యవహరింస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. బొగ్గు కుంభకోణంలో సీపీఐ తీరును సుప్రీంకోర్టే తప్పటిందని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టుకు సీబీఐ తప్పుడు నివేదికలను అందిస్తోందని కొణతాల అన్నారు.
సీబీఐ పంజరంలో రామచిలుకలా మారిందని సుప్రీమే వ్యాఖ్యానించిందని ఆయన పేర్కొన్నారు. సీబీఐ న్యాయవాదుల తీరు సరిగా లేదని, హైకోర్టులో ఒకలో సుప్రీంకోర్టులో మరోలా సీబీఐ వ్యవహరిస్తోందని కొణతాల అన్నారు.