సీమాంధ్ర పార్టీల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది: కడియం
వరంగల్, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌లో తాను చిత్తశుద్ధితో చేరానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పలువురు వివిధ రకాలుగా చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ఇవాళ వరంగల్ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పదవుల కోసం చేరలేదని తేల్చిచెప్పారు. తన వల్ల పార్టీకి చిన్న ఆటంకం కూడా కలగనీయమని పేర్కొన్నారు. తెలంగాణకు టీడీపీ, కాంగ్రెస్ ప్రధాన శత్రువులు అని చెప్పారు. సీమంధ్ర పార్టీల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.