సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్ మండలం లోని సత్వర్, బుర్డిపాడ్, తుంకుంట, కొత్తుర్ బి గ్రామాలలో 80 లక్షల ప్రత్యేక అభివృద్ది నిధులతో సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేసిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పరచాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోని 138 గ్రామాలకు 20 లక్షల చొప్పున 27.60 కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ పెంట రెడ్డీ, మండల అద్యక్షులు ఎంజీ రాములు, ఉప సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు నారాయణ, ఎస్సి సెల్ మండల అద్యక్షులు రాజు ఎస్టీ సెల్ మండల అద్యక్షులు హిరు రాథోడ్, పిఏసీఎస్ డైరెక్టర్ మచ్చెదర్, మండల యువత అద్యక్షులు గోవర్ధన్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు సరస్వతి రెడ్డీ, బిసి సెల్ మండల అద్యక్షులు అమిత్, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు శెట్టి రాథోడ్, వహీద్ మైనారిటీ సెల్,సర్పంచ్ లు మాణిక్ రెడ్డీ, కరణ్ రాజ్, రాని అభ్రహం, ఎంపీటీసీ లు పార్వతి, బ్యాగరి శంకర్, నాయకులు ఇజ్రాయేల్ బాబీ, జగ్దిష్, బాబు, శరణయ్య స్వామీ డేవిడ్, శ్రీనివాస్ గ్రామ పార్టీ అద్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు