సీసీ రోడ్లు ప్రారంభించిన స్థానిక సర్పంచ్

పెద్దవంగర సెప్టెంబర్ 21(జనం సాక్షి ) పెద్దవంగర మండలం గంట్లకుంట గ్రామంలో బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహాయ సహకారాలతో మూడో వార్డు ఆరో వార్డులో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 18 లక్షలు సిసి రోడ్డు స్థానిక సర్పంచ్ చింతల భాస్కర్, ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అన్ని రంగాల లో గ్రామాలు మరియు తండా లు,అభివృద్ధి చెందుతున్నాయి అన్నారు,ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు పులిగిల్ల కుమారస్వామి,టిఆర్ఎస్ నాయకులు పులిగిల్ల పూర్ణచందర్,ఏనుగంటి వెంకట స్వాములు, మందపురి సమ్మయ్య, గోపు జంపయ్య,సాయిని లింగయ్య,ఎరుకల చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు