సుందర్ నగర్ రోడ్డు పనులలో….. నాణ్యత లోపించిందని కాంగ్రెస్ కౌన్సిలర్ల వినూత్న నిరసన :

మున్సిపల్ కార్యాలయం వద్ద సహపంక్తి భోజనాలు చేసి నిరసన….

మిర్యాలగూడ ఆగస్టు 22 జనం సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని సుందర్ నగర్ వార్డులో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిందని, అధికారుల పర్యవేక్షణ కరువైందని ఆరోపిస్తూ సోమవారం మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం వద్ద సహపంక్తి భోజనలు చేసి కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు, వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి సుందనగర్ వార్డుల్లో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు గాను ఇసుక సిమెంట్ కాకుండా కంకట్రస్టు కంకర డస్టుతో తక్కువ పరిణామం లో సిమెంట్ ను కలిపి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారని దాంతో నాణ్యత లోపించిందని రోడ్డు దెబ్బతింటుందని పేర్కొంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు నిరసన వ్యక్తపరిచారు. స్థానిక కౌన్సిలర్ కు సమాచారం లేకుండా కాంట్రాక్టర్ పనులు చేపట్టడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. పనులను పరిశీలించి, పర్యవేక్షించి, తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు కోరారు ఈ కార్యక్రమంలో
మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి (బి ఎల్ ఆర్), పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ చిలుకూరి బాలు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మున్సిపల్ కౌన్సిలర్లు కొమ్ము శ్రీనివాస్, బండి యాదగిరి రెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి, లావూరి రవి నాయక్, క్రికెట్ జానీ, మోయిజ్, కొమ్మన నాగలక్ష్మి, కొమ్ము నాగేందర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు