సునందాపుష్కర్‌ మృతి కేసులో శశిథరూర్‌ నిర్దోషి


కేసును కొట్టేసిన ఢల్లీి సెషన్స్‌ కోర్టు
న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): సునంద పుష్కర్‌ మృతి కేసులో నిందితుడైన ఆమె భర్త, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ను ఢల్లీి సెషన్స్‌ కోర్టు బుధవారం నిర్దోషిగా ప్రకటించింది. 2014 సంవత్సరం జనవరి నెలలో సునంద పుష్కర్‌ హోటల్‌ గదిలో శవమై కనిపించారు. సునంద డ్రగ్స్‌ తీసుకున్నట్లు వైద్య నివేదిక సూచించింది. సునంద కేసును హత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరిపారు. సునంద కేసులో ఐపీసీ సెక్షన్‌ 498 ఎ, 306 ఆత్మహత్యకు ప్రేరణ కింద కేరళ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ పై పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్‌ సమర్పించారు. ఈ కేసును ఢల్లీి సెషన్స్‌ కోర్టు బుధవారం డిశ్చార్జ్‌ చేసింది.
కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌కు విముక్తి లభించింది. భార్య సునందా పుష్కర్‌ అనుమానాస్పద మృతి కేసులో ఎంపీ శశిథరూర్‌పై ఉన్న ఆరోపణలను కోర్టు విచారించింది. ఢల్లీి హైకోర్టు స్పెషల్‌ జడ్జి గీతాంజలి గోయల్‌ ఈ తీర్పును వెలువరించారు. కోర్టుకు బాండ్లు సమర్పించాలని న్యాయమూర్తి తన తీర్పులో ఎంపీ శశిథర్‌ని ఆదేశించారు. కోర్టు తీర్పు తర్వాత శశిథరూర్‌ రియాక్ట్‌ అయ్యారు. సునందా పుష్కర్‌ 2014, జనవరి ఏడో తేదిన అనుమానాస్పద రీతిలో మరణించారు. ఢల్లీి పోలీసులు ఈ కేసులో విచారణ చేపట్టారు. ఈ కేసులో శశిథరూర్‌ తరపున సీనియర్‌ అడ్వకేట్‌ వికాశ్‌ పాహ్వా వాదించారు. సునందను మానసికంగా కానీ శారీరకంగా కానీ తన క్లయింట్‌ వేధించలేదని న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఫోరెన్సిక్‌, మెడికల్‌ నివేదికల ప్రకారం
సునంది హత్య లేక సూసైడ్‌ కూడా కాదని చెబుతున్నట్లు కోర్టులో వాదించారు. ప్రమాదవశాత్తు సునంద మరణించి ఉంటుందని కొన్ని నివేదికలను కోర్టుకు సమర్పించారు. నాలుగేళ్ల విచారణ తర్వాత ఢల్లీి పోలీసులు ఎటువంటి ఆధారాలను సేకరించలేకపోయినట్లు పాహ్వా కోర్టుకు చెప్పారు.