సునాయాసంగా ముగిసిన 200 రోజుల యాత్ర
ప్రజలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్న జగన్
సమస్యలు చెప్పేవారికి భరోసా కల్పించేలా హావిూలు
అమరావతి,జూన్28(జనం సాక్షి): ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర బుధవారం నాటికి 200ల రోజులను పూర్తి చేసుకున్న తరవాత పరిణామాలు చూస్తే ఆయనకు ప్రజల్లో అభిమానం పెరుగుతోందన్న స్పష్టంగా కనిపిస్తోంది. విశేషించి ఉభయగోదావరి జిల్లాల్లో జగన్‌కు అశేష జనవాహిని అండగా నిలిచింది. ఈ రెండు జిల్లాల పరిణామాలే రేపు ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్నది కీలకంగా మారనుంది. గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం తరవాతనే జగన్ అవకాశం కోల్పోయారు. ప్రజలు, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు జగన్‌కోసం ఎదరుచూస్తున్న తీరు చూస్తుంటే ఆయనపట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున అభిమానం కనిపిస్తోంది. పాదయాత్రకు సంఘీభావం తెలపడానికి భారీగా తరలివస్తున్నారు. జగన్ అభీష్టం నెరవేరాలంటూ హిందూ, ముస్లిం, కైస్త్రవ మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేసి ఆశీర్వదిస్తున్నారు. పలువురు జగన్‌తో కరచాలనం చేసి ఆయనతో కలిసి నడిచేందుకు వస్తున్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు అమలు చేయకుండా బాబు మోసం చేశారన్న విమర్శలను స్వాగతిస్తున్నారు. అయితే గతంలో వైఎస్‌కు వచ్చినంతగా ఆదరణ లేకున్నా జగన్‌కు మాత్రం సానుకూలత కనినిస్తోంది. మరోవైపు నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను జగన్ ఏకరువు పెడుతున్నారు. ఎక్కడిక్కడే ఎవరి సమస్యలు విన్నా స్పందిస్తున్నారు. హావిూలు ఇస్తున్నారు. వరాలు కురిపిస్తున్‌ఆనరు. అధికారంలోకి రాగానే చేనేత కుటుంబాలపై ఆధారపడి జీవిస్తున్న వారికి నెలకు రూ.2 వేలు పింఛన్ ఇవ్వడంతో పాటు పిల్లల చదువుకు భరోసా ఇస్తున్నారు. ఈ నాలుగేళ్లలో అన్నీ సమస్యలే అని, ఎవరమూ సంతోషంగా లేరని చెప్పారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వడం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా సకాలంలో మంజూరు చేయడం లేదని విద్యార్థులు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. 16 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతితో పని చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన మెటర్నటీ లీవు మంజూరు చేసేలా చూడాలని కొందరు వినతిపత్రం అందజేశారు. ఇలా సమస్యలు చెప్పే వారంతా ఆవడం ఊస్తుంటే ఆయా వర్గాలు ఆక్రోశంగా ఉన్నాయని అర్థం అవుతోంది. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని పారామెడికల్ సిబ్బంది జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇలా వ్యక్తిగత సమస్యలను వృత్తిగత సమస్యలను వివరిస్తున్నారు. వారందరికి జగన్ భరోసా ఇస్తున్నారు. రానున్నది మన ప్రభుత్వమే అని చెబుతున్నారు. పాదయాత్రలో కలిసి నడిచినవాళ్లు, నడిచేందుకు ఎదురుచూస్తున్నవాళ్లు, అతన్ని దూరంగా చూసినవాళ్లు, దగ్గరగా మాట్లాడినవాళ్లు, కష్టం చెప్పుకున్నవాళ్లు, కుశలం అడిగి తెలుసుకున్నవాళ్లూ, కృతజ్ఞత చూపించిన వాళ్లు అందరూ భవిష్యత్ కోసం ఆశగా చూస్తున్నారు. ఇలా 200 రోజులుగా పాదయాత్ర ముగిసింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రలో సమస్యలే తప్ప ప్రజల్లో ఎక్కడా ప్రభుత్వం పట్ల సంతృప్తి కలగడం లేదు. అందుకే ఎండలో, వానలో, దుమ్ము ధూళి ఎగసిపడుతున్నా, కష్టంలో ఉన్నవారు ఇచ్చిన ప్రతి అర్జీ చదవగలుగుతున్నాడు. తనకోసం ఎదురుచూస్తున్న ప్రతిఒక్కరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ముందుకుసాగిపోతున్నాడు. రోజంతా పది పదిహేను కిలోవిూటర్లు నడిచి, కిక్కిరిసిన బహిరంగ సభల్లో ప్రతి మాట ప్రజలకు చేరేలా సాగుతున్నారు. జగన్ ఒక్కడు కాదు.. కోట్ల మంది గొంతుక అని చెప్పడానికి వస్తున్నారు.