సుప్రీంకోర్టు కేంద్రానికి పీసీఐ నోటీసులు
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ భారత ప్రెస్ కౌన్సిట్ (పీసీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పీసీఐ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ హెచ్.ఎల్.దత్తే, జస్టిస్ సీకే ప్రసాద్‌ల ధర్మాసనం సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. ఇది ప్రాథమిక హక్కులను హరించడమేనని ఆరోపిస్తూ పీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భద్రతా బలగాల కదలికలపై రిపోర్టింగ్ లేదా ఏ విధమైన వార్తలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసారం కాకూడరు అని అటహాబాద& హైకోర్టు ఏప్రిల్ 10న పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.