సుప్రీంలో ములాయంకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో ఆయనపై సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ములాయం అక్రమంగా అస్తులు సమకూర్చుకున్నారని వచ్చిన అభియోగాలపై సీబీఐ విచారణ కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈకేసులో తనపైసీబీఐ జరుపుతున్న విచారణను నిలిపివేయాలనికోరుతూ ములాయం పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. స్వతంత్రంగా దర్యాప్తు కొనసాగించాలని సీబీఐని ఆదేశించింది. అయిత్ణే, ఈకేసులో ములాయం, ఆయన కుమారుడు అఖిలేష్‌లపై విచారణ కొనసాగించాలని ఆదేశిస్తూ ఆయన కోడలు డింపుల్‌యాదవ్‌ను మాత్రం కేసు పరిధి నుంచి మినహాయించింది.ఈకేసు నమోదైన నాటికిఆమె ప్రజాసేవకురాలు కాదని, గృహిణిమాత్రమే అని కోర్టు తీర్పులో పేర్కొంది.