సుమకు డాక్టరేట్ తో పాటు బెస్ట్ రిసెర్చర్ అవార్డు
భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (16)జనంసాక్షి న్యూస్
ముల్కనూర్ గ్రామానికి చెందిన వంగ సుమ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం, విజయవాడ నుండి ఫి హెచ్ డీ (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ) పట్టాను అందుకున్నారు.
విపత్తుల నివారణ మరియూ మిలటరీ కమ్యూనికేషన్ లలో ఉపయోగించే మొబైల్ అడాక్ నెట్ వర్క్ లో డేటా కమ్యూనికేషన్ మరియూ భద్రతని పెంచే పద్దతులపై పరిశోధన చేసినందుకు గాను విశ్వవిద్యాలయం వారు ఈ అవార్డును ప్రధానం చేశారు. దీనితో పాటు ఇటీవల నిర్వహించబడిన ఐజెఐఈఎంఆర్-ఎల్స్వేర్ 2022 లో ఉత్తమ మహిళా పరిశోధకురాలుగా అవార్డు అందుకున్నారు. పరిశోధన సమయంలోనే నెట్, సెట్ ఉత్తీర్ణత సాధించడంతో పాటు సుమకు చెందిన 12 పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ స్కోపస్ జర్నల్స్ లో ప్రచురించబడ్డాయి. ప్రస్తుతం సుమ కరీంనగర్ లోని ప్రభుత్వ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా తన పరిశోదనకు తోడ్పాటును అందించిన గైడ్ డాక్టర్ యండి. అలీ ఉస్సేన్ కు మరియూ తోటి అధ్యాపకులకు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Attachments area