సుమారు 10 లక్షల కుటుంబాలకు లబ్ధి : చిదంబరం

ఢిల్లీ: వచ్చే జనవరి ఒకటినుంచి అమలు చేయ తలపెట్టిన నగదు బదిలీ పథకం వల్ల సుమారు 10 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం తెలియజేశారు. నగదు బదిలీ వల్ల నకీలి లభిదారులను ఏరివేస్తామని, నేరుగా లబ్థి వల్ల నకీలీ లబ్ధిదారులను ఏరివేస్తామని, నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు చేరుస్తామని ఆయన చెప్పారు. ఈ పద్దతిలో అనర్హులకు రాయితీలను తొలగించవచ్చన్నారు. ఆధార్‌ కార్డుల ద్వారా నగదు బదిలీ  పథకం లబ్దిదారులను గుర్తిస్తామన్నారు. 2013 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా నగదు బదిలీ పథకం విస్తరించనున్నట్లు చిదంబరం తెలియజేశారు.