సురేఖ గెలుపు తథ్యం
నర్సంపేట, మే 26(జనంసాక్షి) :
పరకాల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికొండా సురేఖ గెలుపు తథ్యమని ఖనిజాభివృద్ధి శాఖమాజీ డైరెక్టర్ నాడెం శాంతికుమార్ స్పష్టం చేశారు. శనివారం నర్సం పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరకాలలో కొండా సురేఖ గెలుస్తుందనే భయందోళన కాంగ్రెస్, టిడిపి, టిఆర్‌ఎస్ నాయకులకు వణుకు పుడుతుందన్నారు. జిల్లాలో ప్రజాధారణ పొంది నకొండా సురేఖ గెలుపు ఖాయమన్నారు. టీిఆర్‌ఎస్ నాయకుడు హరీశ్‌రావు కొండా దంపతులపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలనిహితవు పలికారు. ప్రజాధారణను చూసి ఓర్వలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు.ఈ సమా వేశంలో ఆ పార్టీ నాయకులు నూనె నర్సయ్య,లింగయ్య, ఇంద్రసేనారెడ్డి, రాజిరెడ్డి, విశ్వేశ్వరచారి, వెంకటేశ్వర్‌రావు, ఇందిర, ఖాజాబి, రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.