సుష్మా మా ప్రశ్నకు జవాబు చెప్పు
– సభ సాగాలని మాకూ ఉంది: రాహుల్
మా ప్రశ్నలకు సుష్మ సమాధానం చెబితేనే సభ నడుస్తుంది: రాహుల్
న్యూ ఢిల్లీ: తాము అడిగిన ప్రశ్నలకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ సమాధానం చెబితేనే సభ సవ్యంగా నడుస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. లలిత్ మోదీతో ఉన్న ఆర్థిక వ్యవహారాల గురించి సుష్మ వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మ, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ ాహాన్‌లపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోకుండా వారిని పొగుడుతున్నారని విమర్శించారు. పార్లమెంటు నడవాల్సిన అవసరం ఉందని తమకూ తెలుసని, అయితే తాము లేవనెత్తిన అంశాలపై స్పష్టత వచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ఇదిలా వుండగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ¬దా ఇవ్వాల్సిందేనని రాహుల్‌గాంధీ స్పష్టంచేశారు. గతంలో పార్లమెంట్ వేదికగా ప్రధాని ఇచ్చిన హావిూకి కట్టుబడి అమలు చేయాలన్నారు. ఎపి హక్కులను కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. దిల్లీలో ఆయన సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇస్తామని యూపీఏ ప్రభుత్వం హావిూ ఇచ్చిందని… ఆ హావిూని నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రత్యేక ¬దా కోసం ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడంపై రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక¬దా ఇచ్చే సమయం ఆసన్నమైందన్నారు. ప్రత్యేక ¬దా ఇచ్చేంతవరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యేక ¬దా ఆందోళనలకు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ మరోసారి సంఘీభావం తెలిపారు. తిరుపతిలో కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ఆత్మాహుతితో అయినా ఎపి ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని ఆయన కోరారు. ప్రత్యేక ¬దా ఎపి ప్రజల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక ¬దా ద్వారా ఎపి ప్రజలకు న్యాయం చేయాలని రాహుల్ అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో అదే ఉద్దేశంతో ప్రత్యేక ¬దా పై ప్రకటన చేయడం జరిగిందని అన్నారు. మునికోటి త్యాగం మరవలేనిదని, ఆయన ఆశయ సాధనకోసం నిరంతరం కృషిచేస్తామని వారు పేర్కొన్నారు.