సుష్మిత నిర్మాతగా శ్రీదేవి శోభన్‌ బాబు


మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా మారి,తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ’గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టెయిన్మెంట్స్‌’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇందులో ’షూట్‌`అవుట్‌ ఎట్‌ ఆలేరు’ అనే కైమ్ర్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు. ఇదే క్రమంలో ప్రస్తుతం ’శ్రీదేవి శోభన్‌ బాబు’ అనే టైటిల్‌తో మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సంతోష్‌ శోభన్‌ ` గౌరీ కిషన్‌ జంటగా నటిస్రున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, 22న ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తాజాగా ’శ్రీదేవి శోభన్‌ బాబు’ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. గోల్డ్‌ బాక్స్‌ ఎంట్టంల్గªన్మెంట్స్‌ బ్యానర్‌పై విష్ణు ప్రసాద్‌ ` సుష్మిత కొణిదెల ఈ మూవీ నిర్మిస్తున్నారు.