సూరజ్‌కుండ్ సాధించింది శూన్యం…!
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రజల గురించి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచన చేయాలి. అలాగే దేశం ఎదుర్కొంటున్న సమస్యలపైనా ఆలోచన చేయాలి. ప్రభు త్వంలో ఉన్నందున కిందిస్థాయిలో ఏం జరుగుఉతందో, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే అధికార యం త్రాంగం చేతిలో ఉంటుంది. నిఘా వ్యవస్థ, గూఢాచార వ్యవస్థ కూడా అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఈ వ్యస్థల ద్వారా అసలు ప్రజల మనోగతం ఏంటనేది కూడా తెలుసుకునే వీలుంది. అలా చేసి వారికి అనుగుణంగా పాలన మార్చుకుని, ప్రజారంజక పాలన అందించే ప్రయత్నం చేయాలి. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేయడంలో విఫలమయ్యింది. అంతేగా కుండా సూరజ్‌కుండ్‌లో ఆ దిశగా చర్చ జరిగిన దాఖలాలు కనిపిం చలేదు. కేవలం ఆత్మస్తుతి, పరనింద అన్న చందంగా వారి మేథో మథనం సాగింది. ఏ విధంగానైనా అధికారాన్ని కబ్జా చెయ్యాల న్నదే విపక్షాల అసలు ఉద్దేశమని సోనియా విమర్శలు గుప్పించడం ఎంత దారుణం. వాటి దురాశ దేశ ప్రజాస్వామ్య, సార్వభౌమ, లౌకిక విలువలకు విఘాతకరమైనా విపక్షాలకు లెక్కేలేదని వ్యాఖ్యా నించారు. తమను తాము పొగుడుకునేలా,విపక్షాలను తిటట్టేలా ఎన్నికలే లక్ష్యంగా జరిగిన చర్చలకు సూరజ్‌కుండ్ వేదికైంది. ప్ర భుత్వ విధానాల్లోని మంచిచెడ్డలను తర్కించే విజ్ఞత గాని, ప్రజల అవసరాలపై దృష్టి కానీ లేకుండా పోయింది. ప్రభుత్వం, పార్టీ నడుమ సమన్వయాన్ని పటిష్టం చేసి సార్వత్రిక సమరానికి కాంగ్రెస్ శ్రేణులను కదిలించడమే లక్ష్యంగా సోనియా ఉద్బోధ సాగిపోయిం ది. అందులో తప్పుపట్టాల్సింది ఏవిూ లేకపోయినా- అసత్యాలు, అర్ధసత్యాల వ్లలెవేతతో అటు పార్టీ ఇటు ప్రజల కళ్లకు గంతలు కట్టాలనుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. కొంతమంది ధనవంతులకు ఉపకరించే ఆర్థిక సిద్దాంతాలు పేదల న్యాయబద్ధమైన ఆకాంక్షలను తీర్చలేవని రాష్ట్రపతిగా చేసిన తొలి ప్రసంగంలో ప్రణబ్ ముఖర్జీ కుండబద్దలు కొట్టారు. ఎనిమిదిన్నరేళ్లుగా అవే విధానాల అమలు తో నిరుపేదల ఉసురు పోసుకొంటున్న మన్మోహన్ సర్కారు- ఆమ్ ఆద్మీకి ఆలంబన తామేనని ఇప్పటికీ చెప్పుకోవడం ప్రజలను వం చించడం తప్ప మరోటి కాదు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటున్నా మన్మోహన్ సారథ్యంలో జాగ్రత్తగా బండి నెట్టుకొస్తున్నామని, ఆమ్ ఆద్మీ ప్రయోజనాల పట్ల కాంగ్రెస్ నిబద్ధత తమకు గర్వకారణమనీ సోనియా వ్యాఖ్యానించారని సమాచారం. అందులో భాగంగానే త మ విధానాల పట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించడం, విపక్షాల విమర్శల్ని సమర్థంగా తిప్పికొట్టడం జరూరుగా జరగా లన్నది సోనియా ఆదేశంగా కనిపిస్తోంది.దారిద్యర్రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబాన్నీ మూడేళ్లలో రాష్టీయ్ర స్వాస్థ్య బీమా యోజన పరిధిలోకి తెచ్చి, నాణ్యమైన వైద్య సేవలందించేలా ప్రతి జిల్లా ఆసు పత్రి స్థాయి పెంచుతామన్న హావిూ దిక్కులేనిదైంది. ఆహార హక్కు చట్టం పండిత చర్చల్లో పల్టీలు కొడుతుంటే, నాణ్యమైన చదువుల్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెస్తామన్నది అతీగతీ లేకుండా పడి ఉంది. వ్యవసాయాన్ని లాభసాటి చెయ్యడానికి కాంగ్రెస్ ప్రకటిం చిన కృతనిశ్చయానికి ఏ చీడపీడలు పట్టాయో ఎవరికీ తెలీదు. ఎంచబోతే మంచమంతా కంతలే అన్నట్లుగా ఉన్న హావిూల అమ లు ఎప్పటికి తెమిలేను? ప్రభుత్వాన్ని నడుపుతున్నవారు ఏ నిర ్ణయం తీసుకోవాలనుకొన్నా పార్టీ అభిప్రాయం తెలుసుకొని తీరాలని కాంగ్రెస్ అధ్యక్షుడిగా కృపలానీ నాటినుంచి వల్లె వేస్తున్నదే. ఇందిర, రాజీవ్, పీవీ జోడుగుర్రాల స్వారీ చేసినవారే కావడంతో ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. ప్రధానమంత్రిగా తన పరిమితులు తెలుసునన్న మన్మోహన్ సైతం సోనియా మాటే శిరోధార్యంగా పాల న సాగిస్తున్నప్పుడు- ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం లేక పోవడం అన్న ప్రశ్నే తలలెత్తదు. కొన్నిసార్లు ప్రభుత్వం తీసుకొనే ని ర్ణయాలు పార్టీకి రుచించడం లేదంటూనే, ఇరువర్గాల అబి óప్రాయా ల మధ్య సమతూకం సాధించాలని సోనియా హితబోధ చేశారు.
ప్రజల సంక్షేమం, సౌభాగ్యాలే తమ తొట్టతొలి ప్రాధాన్యం అంటూనే- డబ్బు చెట్లకు కాయవన్న కటువైన మాటలతో ప్రధాని ధరల పెంపును సమర్థించుకోవడం ఏ పేదరిక నిర్మూలనకో చెప్పి ఉంటే బాగుండేది. రైతుల మేలుకోసమే చిల్లర వర్తకరంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులన్న అసంబద్ధ వాదన రుజువు చేస్తోంది. ఏ స్థాయిలోనైనా అవినీతిని సహించేది లేదంటూప్లీనరీ వేదికపైనుంచి సోనియా ప్రతిపాదించిన నాలుగు సూత్రాల అజెండా ఏమైంది? నిర్దిష్ట కాలావధిలో ఏ స్థాయి కుంభకోణాలైనా విచారణ పూర్తి అయిపోయేలా కొత్త వ్యవస్థను రూపొందించాలన్న సూచనకు పునాది వేయలేకపోయారు. తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారే తప్ప విచారణకు ముందుకు రాలేకపోయారు. పూర్తి అవినీతిలో కూరుకుపోయి, పారిశ్రామిక వేత్తల క్షేమమే దేశ క్షేమంగా భావిస్తూ వారికి కొమ్ముకాసే విధంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఈ దేశం బాగుపడుదుగాక బాగుపడదని ప్రజలు గుర్తిస్తే మంచిది.