సూర్యాపేట,యాదాద్రిల్లో ఇవిఎం స్ట్రాంగ్ రూమ్‌లు
లాంఛనంగా ప్రారంభించిన శశాంక్ గోయల్
నల్లగొండ,డిసెంబర్15 (జనంసాక్షి):- ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, యాదాద్రి జిల్లల్లోని నూతన కలెక్టరేట్ భావన సముదాయంలో నిర్మాణం చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ప్రాంబించారు. తెలంగాణ రాష్ట్రంలోని 23 కొత్త జిల్లాల్లో 22 కొత్త ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్స్ మంజూరయ్యాయని, అందులో 20 పూర్తి కాగా రెండు తుది దశలో ఉన్నాయని శశాంక్ గోయల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 23 కొత్త జిల్లాల్లో 22 కొత్త ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్స్ మంజూరయ్యాయని, అందులో 20 పూర్తి కాగా రెండు తుది దశలో ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు.సూర్యాపేటలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ పక్రియలో ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ కీలకమన్నారు.వాటిని సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచడానికి ప్రత్యేకమైన గోడౌన్స్ ఏర్పాటు చేశామన్నారు. భువనగిరిలోని నూతన కలెక్టరేట్‌లో విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ పక్రియలో ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ కీలకమన్నారు. వాటిని సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచడానికి ప్రత్యేకమైన గోడౌన్స్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఓటరు నమోదు పక్రియ కొనసాగుతుందని, జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. సవరణ కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెరిఫికేషన్‌కు బిఎల్‌వోలు వచ్చినప్పుడు ప్రజలందరూ సహకరించాలని శశాంక్ గోయల్ అన్నారు.
అంతకుముందు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు ప్రసాదం అందజేశారు.
అనంతరం ఆయన ప్రధానాలయాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో భూపాల్ రెడ్డి, ఆలయ ఏఈవో శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.