సెప్టెంబర్‌లో మోదీ అమెరికా పర్యటన
మరోమారు విదేశీ పర్యటనకు మోడీ
న్యూఢిల్లీ,ఆగస్ట్10(జనంసాక్షి): మరోమారు విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ సిద్దం అవుతున్నారు. స్వాతంత్య్ర దినోతసవం మరునాడే ఆయన పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 16-17 తేదీలలో ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈలో పర్యటించనున్నారు. ఆగస్టు 16వ తేదీన అబుదాబికి చేరుకుని ఆ మరుసటి రోజు 17న దుబాయ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి భారతీయ సమాజం సుమారు 40000 వేల మంది భారతీయుల మద్య ప్రసంగించేందుకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 1981 సంవత్సరంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గల్ఫ్ పర్యటన తర్వాత, మళ్ళీ 34 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని గల్ఫ్ ప్రాంతంలో పర్యటించడం నరెంద్ర మోడీ కావటం విశేషం.ఈ నెల 16, 17 తేదీలలో ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈలో పర్యటించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం ఆగస్టు 16వ తేదీన ప్రధాని అబుదాబికి చేరుకుంటారు. ఆ మరుసటి రోజు 17న దుబాయ్‌లో పర్యటిస్తారు. యూఏఈ దేశాలకు, భారత్‌కు మధ్య వాణిజ్య ఒప్పందాలు, దౌత్యసంబంధిత వ్యవహారాలపై ఆయా దేశాధినేతలతో ప్రధాని మోదీ చర్చించనున్నారు. దీంతోపాటుగా అక్కడ వుంటున్న భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో సమావేశమవనున్నారు. అనంతరం 26న కాలిఫోర్నియాలోని సిలికాన్‌వ్యాలీని సందర్శించనున్నారు. ప్రధాని ప్రసంగానికి 20వేలకు పైగా ప్రవాస భారతీయులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. గడచిన మూడు దశాబ్దాలలో భారత ప్రధాని ఎవరూ సిలికాన్ వ్యాలీని సందర్శించలేదు. ఈ ప్రత్యేకత సాధించనున్న తొలి భారత ప్రధాని మోదీ అవుతారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. చివరగా 28న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొని, భారత్‌కు తిరిగిరానున్నట్లు అధికారులు వెల్లడించారు.